Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.!
- May 22, 2024 / 01:07 PM ISTByFilmy Focus
టాలీవుడ్లో ఎక్కువ ట్రోల్ అయ్యే హీరోలుగా దేవరకొండ బ్రదర్స్(విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ) గురించి చెప్పుకుంటారు. విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ గురించి చాలా ట్రోల్స్ వస్తాయి. ఇక ఆనంద్ దేవరకొండని ఏ కారణం లేకుండానే ట్రోల్ చేసే బ్యాచ్ ఉన్నారు. అయితే వీళ్ళ సినిమాలపై కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఈ మధ్య చూసుకుంటే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) మూవీపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు.
వీటి గురించి తాజాగా ఆనంద్ దేవరకొండ స్పందించి ఎమోషనల్ అయ్యాడు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “మా అన్నయ్య(విజయ్ దేవరకొండ) చేసిన ‘ఫ్యామిలీస్టార్’ సినిమాకి మొదటి నుండీ కావాలనే నెగెటివ్ టాక్ క్రియేట్ చేశారు. అందుకే సైబర్‌క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము. ఆ సినిమా రిలీజ్ రోజుకి 48 గంటల ముందు నుండే నెగెటివ్ టాక్ తో ట్వీట్లు వేశారు. నెగిటివ్ టాక్ తో కూడిన థంబ్ నైల్స్ తో వీడియోలు అప్లోడ్ చేశారు.దీంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు.

సినిమా చూసిన తర్వాత ఫలితం గురించి మాట్లాడటం వేరు. కానీ, రిలీజ్ కి ముందు నుండే ఎందుకు నెగిటివ్ టాక్ వేశారో ప్రేక్షకులకి అర్థం కాలేదు. అలాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా డేంజర్. అది సరైన పద్ధతి కూడా కాదు. కావాలనే మా అన్న సినిమాని నెగిటివ్ చేశారు. ఎదుగుతున్న క్రమంలో ఇలాంటివి సహజం. ఇక నుండి అన్న నుండి మంచి సినిమాలు వస్తాయి. ఈ మధ్యనే మూడు అనౌన్స్ చేశారు. అన్నీ డిఫరెంట్ జోనర్ మూవీస్. కచ్చితంగా మీకు నచ్చుతాయి” అంటూ చెప్పుకొచ్చారు.















