Anand Deverakonda: ‘లైగర్’కు పెద్ద మైనస్ అదే.. అందుకే ఫలితం అలా వచ్చింది : ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడు… ఆనంద్ దేవరకొండ కుడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అతను నటించిన ‘బేబీ’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో అతను ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో అతను తన అన్న విజయ్ దేవరకొండ గురించి.. అతని ‘లైగర్’ సినిమా ఫలితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.  ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ… ” అన్నయ్య విజయ్ దేవరకొండ లేటెస్ట్ డిజాస్టర్ ‘లైగర్’ సినిమా ఫెయిల్యూర్‌పై కూడా ఆనంద్ దేవరకొండ మాట్లాడారు.
‘అన్నచరిష్మా, లుక్స్ ను మాత్రమే కాకుండా ఆయన డైలాగ్ డెలివరీని, వాయిస్‌ను కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు, అభిమానిస్తారు. ‘పెళ్లిచూపులు’ నుండి ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ వాయిస్ వినిపించింది. అది జనాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆయనకు నత్తి ఉన్నట్లు చూపించడం అనేది మైనస్. ప్రాపర్‌ క్యారెక్టర్ డిజైన్ చేసుంటే సినిమా ఫలితం కూడా మరోలా ఉండేది.
‘లైగర్’ కోసం (Anand Deverakonda) అన్నయ్య(విజయ్ దేవరకొండ) ఫిజికల్‌గా, మెంటల్‌గా రెండేళ్ల పాటు చాలా కష్టపడ్డాడు. అన్న సినిమాలు ఫెయిల్ అయినా అతన్ని పాయింట్ చేసి ‘నువ్వు ఎఫర్ట్ పెట్టలేదు అందుకే సినిమా ప్లాప్ అయ్యింది’ అన్నవాళ్ళు లేరు.  ‘లైగర్’ రిలీజ్ అయిన ఆగస్టు 25న మార్నింగ్ షోకే రిజల్ట్ తెలిసిపోయింది. దాని గురించే ఆలోచిస్తూ, ఎవరు ఏం చెప్తున్నారు,
జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దీన్ని పుష్ చేయాలా, ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వాలా? అని అన్న ఆలోచించలేదు. వెంటనే ‘ఖుషి’ ప్రాజెక్ట్‌లోకి వెళ్లిపోయాడు. ఆ రోజు ఒక్కడే కూర్చుని బాధపడొచ్చు. కానీ, వెంటనే మూవ్ ఆన్ అవ్వాలని 2 గంటలు జిమ్‌లో స్పెండ్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus