Ananya Panday: రష్మికను తలపిస్తూ సిగ్నేచర్ మూమెంట్ చేసిన అనన్య..వీడియో వైరల్!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు డైలాగ్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో సందడి చేశాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఎంతోమంది నెటిజన్ల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమాలో పాటలకు సిగ్నేచర్ మూమెంట్ చేయడమే కాకుండా డైలాగులను రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పుష్ప సినిమాకు సంబంధించిన రీల్స్ పెద్దఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇకపోతే తాజాగా మరోసారి పుష్ప సినిమాలోని రష్మిక నటించిన సామి..సామి పాటకు బాలీవుడ్ బ్యూటీ సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ రచ్చ చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న టువంటి అనన్య పాండే తాజాగా ఐఫా 2022 అవార్డ్స్ వేడుకల్లో బాలీవుడ్ భామ సారా అలీఖాన్ తన స్నేహితులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం అనన్య పాండే హోటల్ అబుదాబిలోని సామి సామి పాటకు సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు పుష్ప 2 లో నిన్నే హీరోయిన్ గా తీసుకునేరు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ద్వార మొదటిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus