Anasuya: ‘పుష్ప 2’లో సుకుమార్‌ స్టైల్‌ మారుస్తున్నారట!

‘రంగస్థలం’లో అనసూయ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో…‘పుష్ప’లో కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఉంటుంది. – ‘పుష్ప’ పార్ట్‌ 1 విడుదలకు ముందు చాలామంది నోట ఈ మాట వినిపించింది. అందుకు తగ్గట్టే ఆమె లుక్‌ను కూడా డిజైన్‌ చేశారు సుకుమార్‌. ద్రాక్షాయణిగా అనసూయ… తొలి పార్ట్‌లో చాలా తక్కువ సేపు కనిపించింది. ఆ సినిమా ప్రచారంలో అనసూయ మాట్లాడుతూ… రెండో పార్ట్‌లో నా పాత్ర సత్తా చూస్తారు అని చెప్పుకొచ్చింది. అదేదో మాట వరసకు అందేమో అనుకున్నారంతా.. కానీ ఆ మాట నిజమని, ఎవరూ ఊహించనట్లుగా రెండో పార్టులో ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు.

Click Here To Watch Now

‘పుష్ప – ది రైజ్‌’లో పాత్రల విషయంలో వచ్చిన ఫీడ్‌ బ్యాకో లేక ముందే అనుకున్నారో తెలియదు కానీ… సెకండ్ పార్ట్‌ అంటే ‘పుష్ప – ది రూల్‌’లో అనసూయ పాత్ర ఇంపార్టెన్స్‌ను బాగా పెంచారట. ఇంకా చెప్పాలంటే సినిమాలో మెయిన్‌ విలన్‌గా ద్రాక్షాయని ఉరఫ్‌ అనసూయనే ఉంటుందని సమాచారం. తొలి పార్టు క్లైమాక్స్‌లో చూపించినట్లుగా భన్వర్‌సింగ్‌ షెకావత్‌తో ఉన్న వైరాన్ని అండర్‌ ప్లే చేస్తూ.. మెయిన్‌ విలన్‌గా అనసూయను మలుస్తారని అంటున్నారు. దీని కోసం ప్యాడింగ్‌ ఫస్ట్‌ పార్టులో మంగళం శ్రీనుతో… ‘నీ వల్ల కాదంటే చెప్పు నేను చూసుకుంటా’ అని ద్రాక్షాయణితో అనిపించారు కూడా.

నిజానికి ‘పుష్ప 2’ పనులు ఈ పాటికే మొదలవ్వాలి. ‘పుష్ప 1’ విడుదలైన వెంటనే ‘పుష్ప 2’ సినిమా పనులు మొదలుపెట్టేస్తారని అన్నారు. అయితే ఏమైందో అల్లు అర్జున్‌, సుకుమార్‌ కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకున్నారు. ‘పుష్ప’ తొలి పార్టు సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ పని చేశారు. ఏకంగా దర్శకుడు సుకుమారే… ప్రచారానికి అందుబాటులో లేకుండా పోయారు. సినిమా విడుదల ముందు రోజు, ఆ తర్వాత వచ్చారనుకోండి. ఈ నేపథ్యంలో కాస్త రెస్ట్‌ తీసుకుంటున్నారు. మరోవైపు బన్నీ కూడా అలానే వెకేషన్‌లో ఉన్నాడు.

త్వరలో అందరూ మళ్లీ ‘పుష్ప’ మూడ్‌లోకి వచ్చేస్తారని టాక్‌. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని చిత్రబృందం చూస్తోంది. అయితే ఇప్పుడు మొదలుపెడితే ఏ దసరాకో, లేక క్రిస్‌మస్‌కో రిలీజ్‌ అవుతుంది. అప్పుడు ద్రాక్షాయణి పాత్ర సంగతి తేలుతుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus