విజయ్ దేవరకొండ – అనసూయ ల వివాదం అందరికీ తెలిసిందే. నిజానికి విజయ్.. అనసూయని పేరు పెట్టి నెగిటివ్ కామెంట్ చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అర్జున్ రెడ్డి టైం నుండి అనసూయ విజయ్ దేవరకొండ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. అక్కడితో అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఏదో ఒక రకంగా అతని అభిమానులను కెలుకుతూ వచ్చింది అనసూయ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘విజయ్ దేవరకొండ మనిషి కావాలని డబ్బులు ఇచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నాడు.
విజయ్ కి తెలీకుండా ఇదంతా జరగదు కదా’ అన్నట్టు కామెంట్ చేసింది. ఇక చెప్పాలనుకున్నది చెప్పేశాను .. ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్టు కూడా అనసూయ చెప్పుకొచ్చింది. ‘విమానం’ సక్సెస్ మీట్లో భాగంగా అనసూయ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ .. ” విజయ్ దేవరకొండ తో వివాదం గురించి మాట్లాడాలని అనుకున్నాను. అందుకు గల కారణాన్ని కూడా వివరించాలని ప్రయత్నించాను. ఒక్కసారి కాదు చాలా సార్లు ట్రై చేశాను. మొదటిసారి ఇంటర్వ్యూలో చెప్పాను.
విజయ్ టీంలో ఓ వ్యక్తి నన్ను ట్రోల్ చేయిస్తున్నాడు. డబ్బులిచ్చి మరీ నన్ను ట్రోల్ చేయిస్తున్నాడు అని తెలిసి బాధపడ్డాను. ఒక మహిళని ఇంత ఘోరంగా ఎలా అవమానిస్తారని కోపం వచ్చింది. నాకు టైం దొరికిన ప్రతిసారి విజయ్ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పాలనుకున్నాను. కానీ నాకు పీఆర్ లు లేరు. నాకు నేనే స్పోక్స్ పర్సన్. నాకు ఆత్మగౌరవం ఉంది. నా మానసిక ప్రశాంతత కోసమే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.