Anasuya: అనసూయ రెమ్యునరేషన్ మళ్లీ పెరిగిందా.. ఎంతంటే?

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపును సంపాదించుకున్న అనసూయ బుల్లితెరకు దూరమైనా సోషల్ మీడియా పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. యాంకర్ అనసూయ ఒక్కరోజు పారితోషికం ప్రస్తుతం రోజుకు 3 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. అనసూయ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అనసూయ పోస్టులు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అనసూయ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండగా ఆమె నటించిన చిన్న సినిమాలు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోకపోయినా పెద్ద సినిమాలకు మాత్రం అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

అనసూయ పుష్ప2 సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. పుష్ప ది రైజ్ లో అనసూయ రోల్ కు మంచి మార్కులు పడగా పుష్ప ది రూల్ లో కూడా ఆమె రోల్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. అనసూయకు సరైన పాత్రలు దక్కితే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పవచ్చు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు అనసూయకు ఛాన్స్ ఇస్తే మాత్రం ఆమెకు నటిగా మరింత గుర్తింపు వస్తుంది.

అనసూయ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా జబర్దస్త్ షో ద్వారానే ఆమెకు గుర్తింపు ఉంది. గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడే అనసూయ సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. కెరీర్ విషయంలో అనసూయ ప్లానింగ్ పర్ఫెక్ట్ అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా నటిగా అనసూయ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో అనసూయ నటిగా మరింత ఎదగడంతో పాటు ఊహించని స్థాయిలో ప్రశంసలను అందుకుంటారేమో చూడాలి. సినిమాలలో అభినయ ప్రధాన పాత్రలకే అనసూయ ఓటేస్తున్నారు. సుమ తర్వాత ఆ రేంజ్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ మంచి పాత్రల్లో నటిస్తే తన క్రేజ్ మరింత పెరుగుతుందని అనుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus