Anasuya: మంచి పాత్ర వస్తే అలా చేస్తానంటున్న అనసూయ!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా కనిపిస్తూ వెండితెరపై అభినయ ప్రధాన పాత్రలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ సినిమాసినిమాకు అనసూయ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. పుష్ప సినిమాలో అనసూయ దాక్షాయని అనే పాత్రలో కనిపిస్తుండగా ఈ సినిమాలోని పాత్ర అనసూయ కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ భార్యగా అనసూయ కనిపించనున్నారని తెలుస్తోంది.

తాజాగా అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్‌మీ ఎనీథింగ్‌ సెషన్‌ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ సమాధానాలను ఇచ్చారు. ఒక నెటిజన్ పెద్ద సినిమాలో మంచి రోల్ ఆఫర్ చేస్తే గుండు కొట్టించుకుంటారా అని అడగగా పాత్ర కోసం అవసరమైతే గుండు కొట్టించుకోవడానికి సిద్ధమేనని అనసూయ ప్రకటించారు. అనసూయ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా కావడంతో పాటు అనసూయను తెగ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని పాత్రల కోసం రిస్క్ చేసే నటీనటులు తక్కువమంది ఉంటారు.

రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అనసూయ లీడ్ రోల్ లో పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో కొన్ని సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసిన అనసూయ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండటం గమనార్హం. సుకుమార్ సినిమాల్లో అనసూయకు వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus