Anasuya: నా భాష పైనే నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు: అనసూయ

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ (Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా యాంకర్ గా బుల్లితెరపై ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై పెద్ద ఎత్తున సందడి చేసిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారడంతో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. ఈ విధంగా బుల్లితెరకు దూరమైనటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈమె కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగా మార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇకపోతే అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి వచ్చే ట్రోల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ రావడం సర్వసాధారణం.

ఇలా తన గురించి వచ్చే ట్రోల్స్ పై ఈమె తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన గురించి మొదట ట్రోల్స్ ఎక్కడ మొదలయ్యాయి అనే విషయం గురించి మాట్లాడుతూ తాను మాట్లాడే భాష గురించి తనపై ట్రోల్స్ మొదలయ్యాయని ఈ సందర్భంగా అనసూయ తెలియచేశారు.

తాను చదువుకున్న చదువు పెరిగిన వాతావరణం బట్టి తనకు ఇంగ్లీష్ బాగా వచ్చని అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించే సమయంలో తాను ఇంగ్లీషులో మాట్లాడటం వల్ల చాలామంది ముందు నువ్వు తెలుగు నేర్చుకో అంటూ తనని ట్రోల్ చేశారని ఈమె తెలియజేశారు. అయితే తాను కూడా తెలంగాణ బిడ్డనేనని ఇంట్లో ఉన్న సమయంలో తప్పకుండా తెలుగులోనే తెలంగాణ యాసలోనే మాట్లాడుతానని ఈ సందర్భంగా అనసూయ తన గురించి వచ్చిన మొదటి ట్రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus