సీనియర్ యాంకర్, నటి అయిన గాయత్రీ (Gayatri Bhargavi) చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ వీడియో ద్వారా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా గాయత్రీ మాట్లాడుతూ.. “యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో మనం ఒకటి చెబితే.. ఇంకో థంబ్‌నెయిల్స్ ద్వారా మేటర్ ని ఎలా డీవియేట్ చేస్తారో మీకు చెప్పడానికి ఇప్పుడు ఇలా వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. నేను ఇటీవల ఓ పాపులర్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను.
ఆ ఛానల్ కి చెందిన యాంకర్ ను నేను (Gayatri Bhargavi) అక్క అని పిలుస్తాను. ఆమె పిలిచారని చాలా ప్రేమగా వెళ్లి చేసి ఇంటర్వ్యూ చేసి వచ్చాను. ఇంటర్వ్యూ కూడా చాలా బాగా వచ్చింది.. కానీ అది టెలికాస్ట్ అయిన తర్వాత చూసి షాకయ్యాను. ఎందుకంటే మా ఆయన ఆర్మీ ఆఫీసర్.. ఆయనకు ఉన్న వేదన.. ఓ సైనికుడి విషయంలో మాకు జరిగిన ఓ సంఘటన చెప్పి ఆ ఇంటర్వ్యూలో నేను నా బాధను వ్యక్తం చేశాను. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ.
అయినా దాన్ని వాళ్ళు ఏం చేశారంటే నేను ఏడ్చిన ఫోటోలు అన్నీ పెట్టి.. ఇదిగో ఇలా రాంగ్ మేటర్ థంబ్ నెయిల్ పై పెట్టారు. ఆ థంబ్నెయిల్ ని మీరు చూస్తే ‘ఆయన మంచులో కూరుకుపోయిన అక్కడే చనిపోయారు.. బాడీని ముక్కలు చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు.. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు..’ అంటూ మా ఫ్యామిలీ ఫోటోలు.. నా ఫోటోలు అన్నీ వేసి వాళ్లకు నచ్చినట్టు ఇలా రాంగ్ థంబ్ నెయిల్ పెట్టారు..
ఒక ఆర్మీ ఆఫీసర్ గురించి, అతని భార్య గురించి ఇలా తప్పుగా ప్రచారం చేయడం చాలా తప్పు.. దీనిపై నువ్వు ఏమనుకుంటున్నావ్ విక్రమ్(గాయత్రీ భర్త)..! మా ఆయన ఇదిగో నా పక్కనే ఉన్నారు..” అంటూ అతనికి క్షమాపణలు చెప్పింది గాయత్రీ. అతను కూడా ‘ఆర్మీకి, ఆర్మీ ఆఫీసర్స్ కి ఇది చాలా అవమానం’ అంటూ తన మనో వేదన వ్యక్తం చేశాడు.
Sorry to hear this 🙁
Her Husband is working hard for us in the #IndianArmy
But in return a youtube channel thumbnail did this pic.twitter.com/QCv8zwOfNj— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 23, 2025