సుధీర్ తో కలిసి స్క్రిప్ట్ లు వింటున్నా: రష్మీ

యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఈ జంటకి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. ‘జబర్దస్త్’ వేదికపై ఈ జంట చేసే హడావిడి మాములుగా ఉండేది. అలానే స్పెషల్ షోల కోసం ఈ జంటను తీసుకొచ్చి పాటలు, సన్నివేశాలను షూట్ చేస్తుంటారు. దీంతో చాలా కాలంగా వీరిద్దరి ఎఫైర్, పెళ్లికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ జంట ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూనే ఉంది.

కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే సుధీర్, రష్మీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు ప్రసారం చేశాయి. అలాంటి వాటిని నమ్మొద్దంటూ చాలా సార్లు రష్మీ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ కార్యక్రమానికి హాజరైన రష్మీకి సుధీర్ తో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన రష్మీ ‘మా ఇద్దరి పెళ్లి జరగాలని జనాలు కోరుకుంటున్నారని నాకు కూడా తెలుసు కానీ ప్రస్తుతం నా ఆలోచనలు, ప్లాన్స్ అన్నీ కెరీర్ పైనే ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

అలానే మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని అడగగా.. అన్నీ కుదిరితే జరగొచ్చు అంటూ తెలిపింది. ప్రస్తుతం సుధీర్ తో కలిసి కొన్ని స్క్రిప్ట్ లు వింటున్న విషయాన్ని రష్మీ బయట పెట్టింది. స్క్రిప్ట్ నచ్చితే కచ్చితంగా కలిసి నటిస్తామని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus