Anchor Rashmi: ఆ ఆశ మాత్రం ఉందంటున్న రష్మీ గౌతమ్!

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సినీ నటిగా, టీవీ యాంకర్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు. విశాఖపట్నంలో పుట్టిపెరిగిన రష్మీ గౌతమ్ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చారు. 2002 సంవత్సరంలో సవ్వడి అనే సినిమాతో రష్మీ కెరీర్ ను మొదలుపెట్టగా ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఆ తర్వాత రష్మీ యువ అనే సీరియల్ లో నటించడంతో పాటు హోలీ అనే సినిమాలో సహాయ పాత్రలో నటించారు.

2013 సంవత్సరం నుంచి జబర్దస్త్ షోలో రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఢీ అనే డ్యాన్స్ షోకు టీమ్ లీడర్ కొనసాగిన రష్మీ గౌతమ్ తాజాగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవాలకు అపాయం కలిగితే అస్సలు తట్టుకోలేరు. బుల్లితెరపై పద్ధతిగా కనిపించే రష్మీ గౌతమ్ సినిమాల్లో మాత్రం గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా నటించారు.

లాక్ డౌన్ సమయంలో మూగజీవాలకు ఆహారం అందించడం కోసం రష్మీ ఎంతో శ్రమించిన విషయం తెలిసిందే. కుక్కలను కొనవద్దని దత్తత తీసుకోవాలని చాలా సందర్భాల్లో ఆమె సూచనలు చేశారు. అయితే జంతు సంరక్షణ గురించి రష్మీ గౌతమ్ ఎక్కువగా శ్రద్ధ పెట్టడంపై కొందరు నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నల గురించి రష్మీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జంతు సంరక్షణ గురించి చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారని ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో తనకు తెలియదని ఆమె అన్నారు.

అయితే మారుతుందనే ఆశ మాత్రం ఉందని ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత నా పోస్ట్ ను చూసి ఒక్కరైనా మారుతారేమోనని రష్మీ గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్మీ గౌతమ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్మీ మూగజీవాలకు మేలు జరిగేలా శ్రమిస్తున్న తీరును చాలామంది సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus