Rashmi,Sudheer: సుడిగాలి సుదీర్ పై ఉన్న ప్రేమను బయటపెట్టిన రష్మీ!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈ కార్యక్రమాల ద్వారా రష్మీ కూడా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే సుడిగాలి సుదీర్ టీం లో రష్మీ పెద్ద ఎత్తున సందడి చేసేది.ఇలా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో మల్లెమాల నిర్వాహకులు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఎన్నో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడంతో వీరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా, నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భావించారు.

ఇలా సుదీర్ రష్మీ గురించి పెద్ద ఎత్తున ప్రేమ వార్తలు రావడంతో ఎన్నోసార్లు వీరిద్దరూ స్పందించి వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని కేవలం స్నేహం మాత్రమే ఉందని కొట్టిపారేశారు. ఇకపోతే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వెళ్లారు.సుధీర్ కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా యాంకర్ గా చేసేవారు. సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి కూడా తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుంది.

ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రతివారం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఇలా వీరి రొమాంటిక్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ..

ఇవన్నీ చూసిన తర్వాత నువ్వేమైనా మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావా అని ప్రశ్నించారు. గతంలో సుధీర్ రష్మి కలిసి ఈ విధమైనటువంటి ఎన్నో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు ఈ క్రమంలోనే అవన్నీ గుర్తుకు వచ్చాయా అనే ఉద్దేశంతో ఆది ఈ ప్రశ్న వేశారు.ఆది ఈ విధంగా అడిగేసరికి రష్మీ మాట్లాడుతూ మేమిద్దరం మనుషులు మాత్రమే దూరమయ్యాము. మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాయి అంటూ సుధీర్ గురించి ఓపెన్ అయ్యారు. ఇలా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus