Rashmi Marriage: తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ రష్మీ..!

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గురించి ఆమె గ్లామర్ గురించి అలాగే సోషల్ మీడియాలో ఆమెకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో తో పాటు ‘ఢీ’ వంటి పలు కామెడీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ.. మరొపక్క సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది.సోషల్ మీడియాలో అయితే ఈమె ఓ స్టార్ అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్ తో పాటు సామజిక అంశాల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈమె వయసు 33 సంవత్సరాలు కాబట్టి.. ఈమె పెళ్లి వార్తలతో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

మొన్నటివరకు సుడిగాలి సుధీర్ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.అయితే అదంతా కేవలం టీవీ షోల కోసం నిర్వాహకులు క్రియేట్ చేసే రూమర్సే అనేది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ‘ఆషాడం అత్తా కోడళ్ళు’ అనే షో లో పాల్గొంది. ఈ షోని యాంకర్ శ్యామల, యాంకర్ రవి లు హోస్ట్ చేశారు. నటి సంగీత కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక రష్మీ ఈ షోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పొచ్చు.డ్యాన్స్ తో రచ్చ చేయడం, యాంకర్ రవి పై పంచులు వేయడం, వచ్చేరాని తెలుగుతో డబుల్ మీనింగ్ డైలాగులు పలకడంతో పాటు ఓ పాట కూడా పాడి తన అభిమానులను అలరించింది.

ఇదిలా ఉండగా.. ఓ గేమ్ లో భాగంగా ఓ నటిని రష్మీ చెంపలపై కొడుతుండగా.. వెంటనే యాంకర్ శ్యామల వచ్చి ‘హే నువ్వు అత్తలా మారకు..నువ్వు కోడలు మాత్రమే’ అంటూ అరిచింది. అందుకు రష్మీ.. ‘ఇంత వయసొచ్చినా నాకు పెళ్లి కాలేదు..కాబట్టి డైరెక్ట్ గా అత్తలా అప్ గ్రేడ్ అవుతా’ అంటూ పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus