Raj Tarun: రాజ్ తరుణ్ తో రెండు సార్లు అదే అనుభవం.. అందుకే నాకు అస్సలు నచ్చడు!

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియనా అందరికీ సుపరిచిత్రమే. ‘బిగ్ బాస్4’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకుంది. ఈమె గేమ్ ఆడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ‘బిగ్ బాస్4’ తర్వాత ఈమెకు బోలెడంత క్రేజ్ ఏర్పడింది. అంతకు ముందు ఈమె యాంకర్ అన్న సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె రాజ్ తరుణ్ నటించిన ‘అనుభవించు రాజ’ సినిమాలో కనిపించింది.

ఈ సినిమాలో ఆమె చిన్న మెరుపుతీగలా మెరిసి మాయమైపోతుంది. అయినప్పటికీ అరియనాని స్క్రీన్ పై చూసి ఆమె అభిమానులు సంతోషపడ్డారు. కాకపోతే ఈమె హీరో రాజ్ తరుణ్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అరియనా మాట్లాడుతూ.. “ఒకప్పుడు రాజ్‌ తరుణ్‌ నాకు అస్సలు నచ్చేవాడు కాదు. అతని సినిమాలో ఎలా నటించానో కూడా అర్థం కావట్లేదు. టీవీల్లో అతని సినిమాలు వస్తే తీసేయ్‌మని చిరాకుపడేదాన్ని. ఒకరోజు రాజ్‌ తరుణ్ కారులో వెళ్తుంటే అతనికి యాక్సిడెంట్‌ అవ్వాలని కోరుకున్నాను.

దీనికి ప్రధాన కారణం గతంలో ఓసారి రాజ్ తరుణ్ నన్ను ఇంటర్వ్యూకి పిలిచి వెయింట్ చేయించాడు. చివరకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా డబ్బింగ్ ఉందని చెప్పి వెళ్లిపోయాడు. అంతకు ముందు కూడా ఓసారి ఇలానే చేసాడు. రెండు సార్లు రాజ్ తరుణ్ వల్ల నాకు అదే అనుభవం ఎదురైంది.అందుకే ఈ సినిమా షూటింగ్లో.. ఓ రోజు కావాలనే సెట్‌లో రాజ్‌ తరుణ్‌ను 8 గంటలు వేయిట్‌ చేయించాను” అంటూ చెప్పుకొచ్చింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus