యాంకర్ సుమ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమా ప్రస్తుతం వరస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా వేడుకలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సుమ తాజాగా నీట్ వరంగల్ లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో స్ప్రింగ్ స్ప్రీ-23 కళా ధ్వని కల్చరల్ ఫెస్టులో తొలి రోజు నిర్వహించిన లెట్స్ టాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుమ (Suma) దసరా సినిమాలోని చంకీల అంగీలేసి అనే పాటకు డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా స్ప్రింగ్ స్ప్రీ కోర్ టీం అడిగిన ప్రశ్నలకు సుమ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా సుమను ప్రశ్నిస్తే మీరు కేరళ అమ్మాయి అయినా తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ తన తండ్రి పేరు నారాయణ కుట్టి తల్లి విమల కుట్టి.
వారికి నేను ఏకైక సంతానాన్ని నాన్న రైల్వే ఉద్యోగి అమ్మ ఉద్యోగరీత్యా కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి లాలాగూడలో స్థిరపడ్డాము. నా స్వస్థలం కేరళ అయిన నేను పక్క తెలంగాణ, హైదరాబాది అమ్మాయినే అంటూ సమాధానం చెప్పారు. మీకు ఇష్టమైన సెలబ్రిటీలు ఎవరు అంటూ ఈమెకు మరొక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ.. నా తల్లిదండ్రులే నాకు ఇష్టమైన సెలబ్రిటీలు అంటూ సమాధానం చెప్పారు.
మా అమ్మ నాకు కూచిపూడి డాన్స్ నేర్పించడం వల్ల నాట్యం యాక్టింగ్ పై పట్టు సాధించి యాంకర్ గా రాణిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ముందు గౌరవించడం నేర్చుకోవాలి అంటూ ఈ సందర్భంగా చెప్పినటువంటి ఈ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుమ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే వంద పడకల ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేశారు.