తెలుగులో ఎంతమంది యాంకర్లు ఉన్నా నంబర్ వన్ యాంకర్ మాత్రం సుమ మాత్రమే అని ప్రేక్షకులు భావిస్తారు. షోల విషయంలో, ఈవెంట్ల విషయంలో యాంకర్ గా నూటికి నూరు శాతం సక్సెస్ సాధించిన సుమ 46 సంవత్సరాల వయస్సులో కూడా యాంకర్ గా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులను, సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు. సుమ ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.
సుమ యాంకర్ గా వ్యవహరిస్తే సినిమాలకు ప్లస్ అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదు. అయితే గుడ్ లక్ సఖి ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించడానికి సుమ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని సమచారం. గుడ్ లక్ సఖి సహ నిర్మాత శ్రావ్యా వర్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రావ్య మాట్లాడుతూ కరోనా వల్ల చిరంజీవి ఈ ఈవెంట్ కు హాజరు కాలేకపోయారని రామ్ చరణ్ ను పంపించి సపోర్ట్ చేసినందుకు చిరంజీవికి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు.
శ్రేయాస్ మీడియా సుమను కలిసిన వెంటనే ఆమె అంగీకరించారని రూపాయి కూడా తీసుకోకుండా ఈవెంట్ కు యాంకర్ గా చేసి ఆమె సపోర్ట్ చేశారని శ్రావ్య అన్నారు. రూపాయి కూడా తీసుకోకుండా గుడ్ లక్ సఖి సినిమాకు సుమ సపోర్ట్ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. శ్యావ్య చేసిన కామెంట్ల గురించి సుమ స్పందిస్తూ కొంత సమయం ఉంటే శ్రావ్య తన ఆస్తి వివరాలు చెప్పేలా ఉందని తరువాత సినిమాలకు యాంకర్ గా చేసే సమయంలో మొత్తం తీసుకుంటానని అన్నారు.
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కీర్తి సురేష్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. గుడ్ లక్ సఖి ట్రైలర్ రొటీన్ గానే ఉన్నా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని కీర్తి సురేష్ అభిమానులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.