Suma son Roshan: కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుమ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి వారిలో యాంకర్ సుమ ఒకరు. ఇకపోతే సుమ కుమారుడు రోషన్ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. సుమ కుమారుడు రోషన్ నటించినటువంటి బబుల్ గమ్ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోషన్ మాట్లాడుతూ తనపై వచ్చినటువంటి ట్రోల్స్ గురించి పలు విషయాలు తెలిపారు. అంతేకాకుండా ట్రోల్ చేసిన వారికి తన మాటలతో గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాను అని ప్రకటించగానే చాలామంది నాపై ట్రోల్ చేశారు.

ఇంత నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటి అసలు వీడు హీరో మెటీరియల్ ఏనా అంటూ చాలామంది నా వెనక కామెంట్లు చేశారని అలా మాట్లాడటం స్వయంగా నేనే విన్నానని ఆ క్షణం బాధపడిన నా సక్సెస్ తో వారికి సమాధానం చెప్పాలని నేను నిర్ణయించుకున్నానని రోషన్ తెలిపారు. కలర్ ఒక మనిషి సక్సెస్ ను డిసైడ్ చేయదని ఈయన తెలిపారు. నేను పుట్టడమే అలా పుట్టానని తెలిపారు.

ఒక మనిషి సక్సెస్ ని ఎప్పుడు కూడా కలర్ డిసైడ్ చేయదని ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ తన సక్సెస్ ని డిసైడ్ చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 29వ తేదీ రాసి పెట్టుకోండి ఈ సినిమాలో ఆది గాడి లవ్ ఆది గాడి ఫైటింగ్ ఎలా ఉంటాయి అనేది మీరే చూస్తారు అంటూ ఈ సందర్భంగా తన కలర్ గురించి ట్రోల్ చేసిన వారికి రోషన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రోషన్ ఇలా మాట్లాడుతూ ఉండగా వెనకలే ఉన్నటువంటి తన తల్లి సుమ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus