Udaya Bhanu: యాంకర్ ఉదయభాను కూతురి లేటెస్ట్ వీడియో వైరల్..!
- September 29, 2022 / 12:26 PM ISTByFilmy Focus
ఉదయభాను.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఉండరేమో.ఒకప్పుడు ఈమె కూడా స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన వ్యక్తే. తనదైన పంచ్‌లు, మాడ్యులేషన్‌తో ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందారు ఉదయభాను. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి వంటి వారు తెలుగు బుల్లితెరను ఏలుతున్న కాలంలో ఉదయభాను ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది. ఒకానొక దశలో యాంకర్‌గా అత్యధిక రెమ్యూనరేషనే యాంకర్ గా ఈమె రికార్డ్ నెలకొల్పింది.
యాంకర్లు కూడా గ్లామర్ వడ్డించగలరు అని ప్రూవ్ చేసింది ఉదయ భాను. తన కుటుంబ కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో 15 ఏళ్ల వయసులోనే హోస్ట్ గా మారిన ఉదయభాను.. హృదయాంజలి ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇక వరుసపెట్టి ‘వన్స్‌మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘జానవులే నెరజాణవులే’, ‘నీ ఇల్లు బంగారంగానూ’ వంటి షోలు ఈమెకు బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. కొన్నాళ్ళు ఇండస్ట్రీలో ఎవరికీ కనపడకుండా పోయిన ఈమె పెళ్లి వార్తతో మళ్ళీ జనాలను పలకరించింది.

అటు తర్వాత ట్విన్స్(ఆడపిల్లలకు) జన్మనిచ్చింది.అప్పటినుండి వారి ఆలనా, పాలనాచూసుకుంటూ గడుపుతుంది ఈ అమ్మడు. మధ్యలో కొన్ని షోలు ‘జూ లక టక’ వంటివి చేసింది. కానీ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఈమె కూతురు వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉదయభాను కూతురు చాలా క్యూట్ గా ఉంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :
కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!















