Vishnu Priya: వచ్చే జన్మంటూ ఉంటే నీకే కూతురుగా పుడతా!

పోవే పోరా కార్యక్రమం ద్వారా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణు ప్రియ అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించినప్పటికీ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు. ఇలా దూరంగా ఉంటున్నటువంటి విష్ణు ప్రియ అడపాదడపా స్పెషల్ ఈవెంట్ లో కనబడుతూ సందడి చేస్తున్నారు. అలాగే ప్రవేట్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాని వేదికగా పెద్ద ఎత్తున సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి విష్ణు ప్రియ తాజాగా మదర్స్ డే సందర్భంగా ఈటీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రియమైన అమ్మకు అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈ టీవీతో అనుబంధం ఉన్నటువంటి వారందరూ కూడా వారి అమ్మలతో హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా రాకింగ్ రాకేష్ నూకరాజు తల్లి గురించి ఒక స్కిట్ చేశారు. ఇందులో కొడుకుల నిర్లక్ష్యం కారణంగా తన తల్లి మరణిస్తుంది. ఇలా తన తల్లి మరణించడంతో ఆ ఇద్దరు కొడుకులు ఎంతో ఏడుస్తారు. అయితే ఇది చూసినటువంటి వారందరూ కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక విష్ణుప్రియ అయితే ఏకంగా స్టేజ్ పైకి వెళ్లి తన తల్లిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

విష్ణు ప్రియ (Vishnu Priya) తల్లి తాజాగా మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె తన అమ్మను గుర్తు చేసుకుంటూ మళ్లీ జన్మంటూ ఉంటే నీకు కూతురుగానే పుడతాను నువ్వే అమ్మగా రావాలి ఐ మిస్ యు అమ్మ ఐ లవ్ యు అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇలా విష్ణు ప్రియ కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus