Bigg Boss 5 Telugu: అనీమాస్టర్ ఆసక్తికరమైన లవ్ స్టోరీ ఏంటంటే..!

బిగ్ బాస్ హాస్ లో తొలిప్రేమని అందులో ఉన్న మరపురాని సంఘటనలని హౌస్ మేట్స్ అందరితో పంచుకున్నారు. ఇందులో భాగంగా అనీమాస్టర్ తన ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలని తెలిపింది. అనీ అంటే అనీత.. నేను చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనుంచీ వచ్చాను. ప్రమోద్ నన్ను ఫస్ట్ టైమ్ కలిసినపుడే నన్ను ఇష్టపడ్డాడు. అంతేకాదు, తను చాలా సింపుల్ గా సాదాసీదాగా ఉండే మనిషి. వచ్చి నాతో డైరెక్ట్ గా చెప్పారు.

అనీ. నువ్వు నాకు బాగా నచ్చావ్, నిన్ను పెళ్లి చేస్కోవాలని ఉంది అని చెప్పాడు. నేను చూస్కుంటా ఫ్యామిలీని అన్నాడు. అప్పుడు నేను కూడా ఓకే చెప్పాను. మాకు పెళ్లి అయ్యింది బాబు కూడా పుట్టాడు. తర్వాత బాబు పుట్టి 2 సంవత్సరాలు అయ్యింది. రెండేళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ లాంటి లవ్ కాదు , బాగా చూసుకుంటాడు ఫ్యామిలీని అని చెప్పాను. మా అత్తమ్మ చెప్పింది. ఏంటి ఇంకా ఐలవ్ యూ కూాడ చెప్పలేదు. అప్పుడే పిల్లలు పుట్టేశారా అంటూ అడిగింది.

ఐలవ్ యూ అంటేనే ప్రేమకాదని, నన్ను బాగా చూస్కుంటాడు అని ఆన్సర్ చెప్పాను. నా దృష్టిలో కేవలం ఐ లవ్ యూ చెప్తేనే ప్రేమకాదు. మొన్నామద్య కోవిడ్ వచ్చిన టైమ్ లో నాకు బోన్స్ అన్నీ బాగా పెయిన్ వచ్చాయి. భరించలేని నొప్పిని అనుభవిస్తున్నప్పుడు మా ఆయనే దగ్గరుండి మరీ చూస్కున్నాడు. ఆయిల్ మసాజ్ చేస్తూ మళ్లీ నన్ను మామూలు మనిషిని చేశాడు. హాస్పిటల్ లో నాకాళ్లు సైతం ఒత్తుతూ నన్ను చిన్నపిల్లలా చూసుకున్నాడు.

ఐలవ్ యూ చెప్పే అవసరం లేదే.. ఇదే ప్రేమంటే అని అనుకున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే అది ఖచ్చితంగా ఆయన సపోర్టే అంటూ వాళ్ల ఆయన గురించి చెప్పింది అనీమాస్టర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus