Angad Bedi: ఆ హీరోయిన్ గురించి హీరో అంగద్‌ బేడి కామెంట్స్!

మృణాల్‌ ఠాకూర్‌ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ఒకే ఒక్క సినిమా ‘సీతారామం’తో యూత్ క్రష్ గా మారిపోయారు. దీంతో ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. రీసెంట్ గా ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో తన బోల్డ్ యాక్టింగ్ ను బయటపెట్టి ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించింది. అయితా తాజాగా ఈ ముద్దగుమ్మ గురించి ఓ నటుడు కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించారు.

ఈ సిరీస్ లో మృణాల్.. హీరో అంగద్ బేడీతో కలిసి చేసిన బోల్డ్ యాక్టింగ్, రొమాన్స్ చూసి కొంతమంది షాక్ అవుతుంటే.. మరి కొంతమంది ప్రశంసిస్తున్నారు. ధైర్యంగా ఇలాంటి పాత్ర చేసి.. తన టాలెంట్ ను నిరూపించుకుందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2’ లో మృణాల్ తో కలిసి నటించిన హీరో అంగద్ బేడి కూడా ఆమెపై స్పందించారు. మృణాల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆమె ఎంతో బ్యూటీఫుల్ లేడీ అందగత్తె అభివర్ణించారు. తనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. “నా దృష్టిలో మృణాల్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న నటి. సహ నటుడిగా ఆమెతో నటించడం వల్ల.. నన్ను నేనేంటో బాగా తెలుసుకున్నాను. ఆ సిరీస్‌లో మా ఇద్దరి ఎపిసోడ్‌ అంత బాగా వచ్చిందంటే.. అందుకు కారణం మృణాల్. ఆ క్రెడిట్ అంతా ఆమెకె సొంతం. స్క్రీన్ పై మా ఇద్దరి పెయిర్ ఎంతో చూడముచ్చటగా ఉందని నా అభిప్రాయం.

అందుకే ఆడియెన్స్ కూడా మా జంటను బాగా ఇష్టపడ్డారని భావిస్తున్నాను. ఆమెతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అలా జరగాలని ఆశిస్తున్నాను. మృణాల్‌ తన కళ్లతోనే వాహాభావాలను పలికించగలదు. ఆమె ఓ అద్భుతమైన నటి. నిజంగా తనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ యాక్టర్స్ తో ఆమె ఒకటి” అని మృణాల్‌ పై ప్రశంసలు కురిపించారు హీరో (Angad Bedi) అంగద్‌ బేడి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus