Anil Ravipudi,Jr NTR: ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

టాలీవుడ్ లో పేరున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఎలాంటి కథనైనా.. వినోదాత్మకంగా తెరకెక్కించడం అనిల్ రావిపూడి స్టైల్. ఆయన కామెడీ కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘ఎఫ్2’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పనుల్లో ఉంటూనే.. మరోపక్క అతడి తదుపరి ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని సమాచారం.

ఈ విషయాన్ని అనిల్ రావిపూడి కూడా కన్ఫర్మ్ చేశారు. అలానే ఎన్టీఆర్ తో కూడా అనిల్ రావిపూడి సినిమా ఉంటుందనే మాటలు వినిపించాయి. ఎన్టీఆర్ కి కూడా వినిపించారని కథనాలను ప్రచురించారు. తాజాగా ఈ వార్తలపై స్పందించారు అనిల్ రావిపూడి. ”ఎన్టీఆర్ తో సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఏదీ ఫైనలైజ్ కాలేదు. బాలకృష్ణతో మాత్రం ఓ సినిమా ఉంది. సెప్టెంబర్ నుంచి అది మొదలవుతుంది. ఇక ఎన్టీఆర్ తో సినిమా విషయానికొస్తే.. నేను ఆయనతో టచ్ లో ఉన్నాను.

అంతవరకే.. ఆయనకు ఎలాంటి లైన్ కూడా చెప్పలేదు” అని వెల్లడించారు. నిజానికి ఎన్టీఆర్ ఇప్పటివరకు తన సినిమాల లైనప్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. ఇప్పుడు బుచ్చిబాబు పేరు కూడా వినిపిస్తోంది. మరి ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అతడి సినిమాలపై క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus