సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. క్లాప్ బోర్డు పట్టుకున్న వాళ్ళే.. ఫ్యూచర్ క్రేజీ హీరో అవ్వొచ్చు. పెద్ద డైరెక్టర్ దగ్గర.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. ఓ సీరియల్ ను డైరెక్ట్ చేసిన వాళ్ళు ఏకంగా దేశం గర్వించదగ్గ సినిమా తీసెయ్యొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన వాళ్ళు.. మాస్ మహా రాజ్ గా ఎదగొచ్చు. ఇలా ఎవరి ఫేట్ ఎవరిలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రతీ శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న వారందరూ.. గతంలో ఎన్నో కష్ఠాలు, అవుమానాలు ఎదుర్కొన్నవారే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి అనుమానం దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఎదుర్కొన్నాడట.
ఇటీవల తరుభాస్కర్ ‘నీకు మాత్రమే చెప్తా’ షోకి… హాజరయ్యాడు అనిల్ రావిపూడి. ఆ షోలో ‘పటాస్’ సినిమా విడుదల సమయంలో తాను ఫేస్ చేసిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నా మొదటి సినిమా ‘పటాస్’ విడుదలకు ముందు స్పెషల్ షోలు వేశాం. అప్పుడు ఓ శాటిలైట్ ఛానెల్ అతను వచ్చి ఆ షో చూసాడు. చూసిన వెంటనే తిట్టి పోసాడు. ‘ఇదో సినిమానేనా?’.. ఇలాంటి సినిమా కూడా తీస్తారా..? చెత్త సినిమా.. అసలు ఒక్క రోజు కూడా ఆడదు ఈ సినిమా.. విడుదల చేసి కూడా వేస్ట్’ అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టి పడేసాడు. దాంతో మాకు చాలా భయమేసింది. ఆ తర్వాత దిల్ రాజు, శిరీష్ లు చూసి సినిమాను విడుదల చేస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది పక్కన పెడితే… ఆ శాటిలైట్ ఛానెల్ ఓనర్‌ను మాత్రం బండ బూతులు తిట్టాలనేంత కసి వచ్చింది. నువ్వో క్రియేటర్ ఏంట్రా..? క్రియేటివిటి నీలో ఎక్కడుందిరా? అంటూ ఇష్టమొచ్చినట్లు తిట్టి ఫుట్ బాల్ ఆడుకోవాలి అనిపించింది” అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.