F3 Movie: అనిల్ ఆ హీరోకు అన్యాయం చేస్తున్నారా..?

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ దగ్గర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్2 సినిమాలో నటించగా ఈ సినిమా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను అందించింది. ఎఫ్2 సినిమాలో నటించిన నటీనటులే ఎఫ్3 సినిమాలో నటిస్తున్నారు. ఎఫ్2కు ఎఫ్3 సీక్వెల్ అని వార్తలు వచ్చినా ఎఫ్3 సీక్వెల్ కాదని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

ఆగష్టు 27వ తేదీన ఎఫ్3 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ డేట్ కు ఎఫ్3 సినిమా రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎఫ్2 సినిమాలో వరుణ్ తేజ్ పాత్రతో పోలిస్తే వెంకటేష్ పాత్ర హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఎఫ్2 లో వరుణ్ తో పోలిస్తే వెంకటేష్ కే ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఎఫ్3 మూవీలో మాత్రం వెంకటేష్ తో పోలిస్తే మెగా హీరో వరుణ్ తేజ్ కే ఎక్కువ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఎఫ్3 సినిమాకు వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ఎఫ్3 సినిమాలో నటిస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వెంకీ అభిమానులు మాత్రం అనిల్ రావిపూడి వెంకటేష్ కు అన్యాయం చేస్తున్నారా..? అని కామెంట్లు చేస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమా తరువాత బాలయ్యతో ఒక సినిమాను మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus