Anil Ravipudi: రావిపూడి క్లారిటీ ఇచ్చినా ఇవి ఆగడం లేదుగా..!

‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అయితే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచింది. కథగా చెప్పుకుంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కొత్త ఫీలింగ్ ఏమీ కలిగించదు. టేకింగ్ పరంగా కూడా అంతే…! కానీ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి.

Anil Ravipudi

కామెడీ ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మార్క్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వదు. అలాగే ‘గురువుకి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే చిన్న మెసేజ్ కూడా ఈ తరానికి తనదైన శైలిలో వివరించాడు దర్శకుడు. ఇలా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువే. కానీ కొంతమంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో ఉన్న చిన్నపాటి లోపాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తున్నారు. వాస్తవానికి ఇందులో బుల్లి రాజు అనే పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

‘ఆ పాత్రతో పెద్ద వాళ్ళని బూతులు తిట్టించడం’ అనేది చిన్న పిల్లల్ని చెడగొట్టేలా ఉంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ పాత్ర వచ్చినప్పుడు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అంతేకాని దాన్ని పర్సనల్ గా ఎవ్వరూ తీసుకోరు. ‘దేనిని ఎంత వరకు తీసుకోవాలి’ అనే విషయంపై ఇప్పుడు ఆడియన్స్ కి పూర్తిగా క్లారిటీ ఉంది. పైగా దీని గురించి అనిల్ రావిపూడి కొద్దిరోజుల ముందు క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

‘ఓటీటీల్లో వచ్చే కంటెంట్, ముఖ్యంగా వేరే భాషల్లోని డైలాగులు తెలుగులో ఎంత ఘోరంగా ఉంటున్నాయి. అవి పిల్లలపై ప్రభావం చూపేలా ఉన్నాయి. కాబట్టి ఓటీటీలకు పిల్లలను దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి?’ అనే పాయింట్ పై బుల్లి రాజు పాత్రని డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయినా సరే సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) రేంజ్ కాంట్రోవర్సీ చేయాలని చూడటం గమనార్హం.

సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన దర్శకుడు.. ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus