గతేడాది చివర్లో నాగ చైతన్య, సుబ్బరాజు వంటి పలువురు సినీ ప్రముఖులు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. అతను మరెవరో కాదు ‘డిమాంటి కాలనీ’ అనే హర్రర్ సినిమాతో పాపులర్ అయిన ఆర్.అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) . ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా స్మాల్ స్క్రీన్ పై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఆ తర్వాత నయనతారతో చేసిన ‘అంజలి సీబీఐ’ బాగానే ఆడింది. దీంతో విక్రమ్ తో ‘కోబ్రా’ అనే సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అది కూడా అంతగా ఆడలేదు. కానీ ‘డిమోటీ కాలనీ 2’ తో హిట్టు కొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇక అజయ్ జ్ఞానముత్తు తన ప్రేయసి పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు అవును.. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ప్రియురాలు షీమోనా రాజ్ కుమార్ ని పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అజయ్ ఈ విషయాన్ని రివీల్ చేశాడు.
పెళ్లి ఫోటోలు షేర్ చేసి షిమోనా- అజయ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. జనవరి 19న వీరి వివాహం జరిగినట్లు అజయ్ తెలిపాడు. చెన్నైలో చాలా నిరాడంబరంగా కొద్దిపాటి బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో జరిగింది అని తెలుస్తుంది. వీరి వివాహానికి సినీ పరిశ్రమ నుండి చియాన్ విక్రమ్ హాజరయ్యారు. అజయ్ షేర్ చేసిన ఫొటోల్లో విక్రమ్ ని గమనించవచ్చు. అలాగే ‘డిమోటీ కాలనీ’ టీం, అలాగే పలువురు దర్శకనిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :