Anil Ravipudi, Balakrishna: బాలయ్య సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తా : అనిల్ రావిపూడి

టాలీవుడ్ యంగ్ హీరోల కంటే సీనియర్ హీరోలు వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు బాలయ్య. అయితే చాలా కాలంగా బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా రూపొందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

Click Here To Watch

బాలయ్యను డైరెక్ట్ చేయడం పక్కా అని.. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కొన్నిరోజుల క్రితమే చెప్పారు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలకృష్ణ గారితో చేయబోయే సినిమా చాలా స్పెషల్ గా ఉంటుందని.. ఇంతవరకు బాలకృష్ణ గారు చేసిన సినిమాలకు భిన్నంగా ఆ సినిమాలో కనిపిస్తారని అన్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు త్వరలోనే మొదలుపెడతానని అన్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

ప్రస్తుతం ఆయన ‘ఎఫ్3’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత బాలయ్య సినిమాను పట్టాలెక్కించనున్నారు. మరోపక్క బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించబోతున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus