Anil Ravipudi Remuneration: ఆ దర్శకుల బాటలో నడుస్తున్న అనిల్ రావిపూడి!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి పటాస్ సినిమా నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వరుస సక్సెస్ లతో దర్శకునిగా తన రేంజ్ ను పెంచుకున్నారు. సినిమాసినిమాకు అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ సైతం పెరుగుతుండగా ఎఫ్3 సినిమాకు మాత్రం రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని ఈ స్టార్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాజమౌళి, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ మరి కొందరు దర్శకులు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

అనిల్ రావిపూడి కూడా ఈ జాబితాలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. రెమ్యునరేషన్ తీసుకుంటే సినిమా హిట్టైనా ఫ్లాపైనా దర్శకుని కెరీర్ పై ఎలాంటి ప్రభావం ఉండదు. వాటా తీసుకుంటే మాత్రం సినిమా సక్సెస్ సాధిస్తే కళ్లు చెదిరే మొత్తం రెమ్యునరేషన్ గా దక్కే ఛాన్స్ ఉంది. ఈ నెల 27వ తేదీన ఎఫ్3 థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. ఏ సెంటర్లలో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నా బీ, సీ సెంటర్లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.

అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే ఈ సినిమా కలెక్షన్లు పుంజుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావాలని మెగా, దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎఫ్3 సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని సమాచారం అందుతోంది. ఎఫ్3 హిట్టైతే అనిల్ రావిపూడికి కచ్చితంగా ప్లస్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అనిల్ రావిపూడి ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ ను సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనిల్ రావిపూడి తర్వాత సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus