Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇలాంటి షాక్ ఇచ్చాడేంటి..!

రాజమౌళి తర్వాత ప్లాప్ అంటూ లేని దర్శకుడిగా ప్రస్తుతానికి అనిల్ రావిపూడి నిలిచాడు. ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2 ‘ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎఫ్ 3 ‘ .. ఇలా అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అతి త్వరలో ‘భగవంత్ కేసరి’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా.. అనిల్ రావిపూడి శైలికి భిన్నంగా ఉంటుంది. అనిల్ ఎక్కువగా సీరియస్ సినిమాలు చేయలేదు.

కామెడీతో కూడిన కమర్షియల్ మూవీస్ చేశాడు. అయితే ‘భగవంత్ కేసరి’ అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్ అంశాలు కలిగిన మూవీ. స్టార్ హీరోలంతా అనిల్ వైపు చూడాలి అంటే.. ఈ సినిమా హిట్ అవ్వడం అతనికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. చిరంజీవి, మహేష్ బాబు.. లతో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది.కానీ ఇందులో నిజం లేదు అంటున్నాడు ఈ (Anil Ravipudi) యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్.

‘మహేష్ తో సినిమా చేస్తున్నాననే వార్త నాకే షాక్ ఇచ్చింది. నాకైతే దాని గురించి తెలీదు. గుంటూరుకారం తర్వాత రాజమౌళి గారి సినిమాలోకి వెళ్ళిపోతారు మహేష్ గారు. అలాగే చిరంజీవి గారికి కథ చెప్పానని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు. కానీ ఛాన్స్ వస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు మహేష్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus