Balakrishna, Anil Ravipudi: అనిల్‌ రావిపూడి కొత్త కథ ఇదేనట… ఓకే అవుతుందా!

NBK అంటే నందమూరి బాలకృష్ణ కాదా… మరి ఇంకేంటి అనుకుంటున్నారా? మామూలుగా అయితే అదే… కానీ యువ దర్శకుడు అనీల్‌ రావిపూడి NBK కి కొత్త భాష్యం చెప్పబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌ ఇదే చర్చ నడుస్తోంది. బాలకృష్ణ – అనీల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మధ్య ఆగిన ఈ ముచ్చట… మళ్లీ మొదలైంది. అయితే ఈసారి కొంగొత్తగా.‘రామారావుగారూ..’ అంటూ కొన్ని నెలల క్రితం ఓ సినిమా పేరు టాలీవుడ్‌లో వినిపించింది.

నందమూరి బాలకృష్ణ – అనీల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అనీల్‌ కూడా సినిమా చేస్తాం అని చెప్పారు. కానీ ఈలోగా వేరే సినిమాలు ఓకే అవుతూ వచ్చాయి. అయితే ఆ సినిమా పేరును రవితేజ వాడేసుకున్నారు. దీంతో ఆ సినిమా లేదని అనుకున్నారు.తాజాగా టాలీవుడ్‌లో NBK అనే కొత్త పేరు చర్చలోకి వచ్చింది. బాలయ్యను మూడు పాత్రల్లో చూపిస్తే ఈ సినిమా ఉంటుందని టాక్‌.

అంటే ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు బాలకృష్ణలను చూడొచ్చు. వారి పేర్లలో తొలి అక్షరాలు N.. B.. K.. కలిసి సినిమాకు NBK అని పెట్టాలని అనుకుంటున్నారట. మరి ఆ కథేంటి, వారి పేర్లేంటి అనేది త్వరలో తెలుస్తుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus