రవితేజ హీరోయిన్ల ఎంపిక విషయంలో ఓ లెక్క ఉంటుంది. స్టార్ హీరోయిన్లను కాకుండా, వైరల్ కథా నాయికలను ఎంపిక చేస్తుంటారు. గతంలో ఇలా చేసిన రవితేజ… ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడో విషయం ఉంది… అదేంటంటే ఆ సినిమా ఇంకా అఫీషియల్ అనౌన్స్ కాలేదు. ఉంది అనే పుకార్లు కూడా బలంగా రావడం లేదు.
‘యానిమల్’ సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చింది నటి త్రిప్తి దిమ్రి. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా త్రిప్తి తన నటనతోనే కాకుండా, ఇంటిమేట్ సీన్‌తో కూడా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన సన్నివేశం వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు ప్రస్తావన అని అనుకుంటున్నారా? ఎందుకంటే రవితేజ కొత్త సినిమాకు ఆమెనే హీరోయిన్ అనుకుంటున్నారట.
రవితేజ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని కూడా అన్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే హీరోయిన్‌ను కూడా చెప్పేస్తారు అని లేటెస్ట్ టాక్. ఆ నాయికే త్రిప్తి దిమ్రి అని చెబుతున్నారు. ఇప్పటికే టీమ్ ఈ విషయంలో ఆమె సంప్రదించిందట. ఆమె (Tripti Dimri) కూడా సానుకూలంగా సమాధానం ఇచ్చిందని భోగట్టా.
ఇప్పటికే రవితేజ – అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ అనే బ్లాక్‌బస్టర్ సినిమా చేశారు. దీంతో ఈ కాంబినేషన్ గురించి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో త్రిప్తి పేరు కూడా ప్రస్తావనకు వచ్చేసరికి కాంబో కేక అని ఆనందపడుతున్నారు. మరి నిజంగానే ఈ కాంబో వస్తుందా అనేది చూడాలి. రవితేజ సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం ‘ఈగల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13 విడుదలవుతుందట. ఆ తర్వాత కొత్త సినిమా సంగతి ఏంటి అనేది త్వరలో తేలుతుంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!