Animal: ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో యానిమల్ రికార్డులు క్రియేట్ చేయనుందా?

రణ్ బీర్ కపూర్, రష్మిక కాంబినేషన్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ 200కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ మూవీ ఫస్ట్ డే బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో యానిమల్ రికార్డులు క్రియేట్ చేయనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. హైదరాబాద్ లో యానిమల్ హిందీ వెర్షన్ బుకింగ్స్ సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి. యానిమల్ మూవీకి ముంబైలో కూడా భారీ స్థాయిలో సైతం బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. యానిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా నిడివి విషయంలో ఏ మాత్రం టెన్షన్ పడట్లేదు. 3 గంటల 21 నిమిషాల నిడివితో తెరకెక్కిన యానిమల్ మూవీ సకెస్ సాధిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి యానిమల్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రావడం లేదు.

యానిమల్ (Animal) సినిమాతో పాటు పలు సినిమాలు విడుదలవుతున్నా యానిమల్ సినిమా స్థాయిలో ఈ సినిమాలకు బుకింగ్స్ జరగడం లేదు. యానిమల్ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం మాత్రం ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు. యానిమల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus