Animal: రెండు వారాల్లో యానిమల్ మూవీ సాధించిన కలెక్షన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 784.85 కోట్ల రూపాయలు వచ్చాయి. రెండు వారాల్లో యానిమల్ మూవీ సాధించిన కలెక్షన్లు తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. యానిమల్ మూవీ ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యానిమల్ మూవీ వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా సంచలనాలను కొనసాగిస్తోంది. యానిమల్ మూవీ ప్రభంజనం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. యానిమల్1 సక్సెస్ సాధించిన నేపథ్యంలో యానిమల్2 మూవీ మరిన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. సలార్ వచ్చే వరకు యానిమల్ ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంటుంది.

యానిమల్ (Animal) సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెన్స్ నిజమైంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో దర్శకునిగా సందీప్ రెడ్డి వంగా ఊహించని స్థాయిలో ఎదిగారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన యానిమల్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. యానిమల్ సినిమా రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ ను ఊహించని స్థాయిలో మెప్పించడం గమనార్హం. యానిమల్ సినిమా రిజల్ట్ తో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం సంతోషంగా ఉన్నారు.

రణ్ బీర్ కపూర్ కు తెలుగులో మార్కెట్ పెరగగా రష్మికకు బాలీవుడ్ లో కోరుకున్న సక్సెస్ దక్కింది. సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమాలు ప్రభాస్, బన్నీలతో తెరకెక్కనుండగా మరి కొందరు స్టార్ హీరోలు సైతం సందీప్ డైరెక్షన్ లో పని చేయడానికి ఇష్టపడుతున్నారు. టీ సిరీస్ భాగస్వామ్యంతో సందీప్ రెడ్డి వంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus