ఇక త్రివిక్రమ్ ఆ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ని వదలడేమో

ఒక్కోసారి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్ అయితే.. వారి బంధం కనీసం పది సినిమాల వరకైనా కొనసాగుతుంది. ప్రస్తుతం అలాంటి రిలేషనే త్రివిక్రమ్ అండ్ అనిరుధ్ ల బాండింగ్ అలానే కనిపిస్తుంది. నిజానికి వీరిద్దరూ కలిసి “అ ఆ” సినిమాకే వర్క్ చేయాల్సి ఉండగా.. అప్పుడు అనిరుధ్ తమిళ సినిమాల కమిట్ మెంట్స్ వల్ల కుదరలేదు. దాంతో అనిరుధ్ స్థానంలో లాస్ట్ మినిట్ లో మిక్కీ వచ్చాడు.

ఇప్పుడు త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి మ్యూజిక్ సమకూరుస్తున్న అనిరుధ్.. “పీకే 25” అనంతరం ఎన్టీయార్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే తదుపరి చిత్రానికి కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus