NTR30: కొరటాల.. అనిరుథ్‌ను తీసుకొస్తున్నాడట

  • May 23, 2021 / 10:06 PM IST

కొరటాల శివ సినిమాల్లో మ్యూజిక్‌ డామినేషన్‌ దేవిశ్రీ ప్రసాద్‌దే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కొరటాల ఐదు సినిమాలు చేస్తే (ఆచార్యతో కలిపి) అందులో నాలుగు సినిమాలకు దేవినే సంగీతం అందించాడు. అయితే ఏమైందో కానీ… ‘ఆచార్య’కు మణిశర్మ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆ తర్వాత సినిమాకు కూడా దేవి ఉండటం లేదా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎన్టీఆర్‌తో కొరటాల చేయబోయే తర్వాత సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుథ్‌ని అనుకుంటున్నారట.

అనిరుథ్‌ సంగీతానికి అభిమానులు మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ‘అజ్ఞాతవాసి’పాటలకు వచ్చిన ఆదరణే దానికి నిదర్శనం. అయితే ‘అజ్ఞాతవాసి’ పరాజయం ప్రభావమో, ఇంకేమో కానీ త్రివిక్రమ్‌ తర్వాత సినిమా ‘అరవింద సమేత’లో ముందుగా అనిరుథ్‌ను అనుకున్నా, సినిమా మొదలయ్యే సమయానికి ఆ స్థానంలోకి తమన్‌ వచ్చేశాడు. అసలు అనిరుథ్‌ ఎందుకు తప్పుకున్నాడు అంటూ ఆ మధ్య చాలా వార్తలొచ్చాయి. అయితే ఎక్కడా క్లారిటీ రాలేదు. ‘అరవింద..’ సమయంలో అనిరుథ్‌ సంగీతం వద్దంటూ త్రివిక్రమ్‌ చెప్పారని కొందరు,

కాదు ‘వద్దులే’ అని ఎన్టీఆర్‌ వద్దనుకున్నారని వార్తలొచ్చాయి. కట్‌ చేస్తే… ఇప్పుడు కొరటాల సినిమాకు అనిరుథ్‌ను తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ‘అరవింద సమేత’ సమయంలో ఎన్టీఆర్‌, అనిరుథ్‌ మధ్య ఏం జరగనట్లే కదా. ‘అరవింద…’ నుండి తప్పుకుంటున్నట్లు గానీ, ఆ తర్వాత గానీ అనిరుథ్‌ ఏం మాట్లాడలేదు. ‘గ్యాంగ్‌ లీడర్‌’కి అదిరిపోయే మ్యూజిక్‌ ఇచ్చి కాలర్‌ ఎగరేశాడంతే!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus