ఊర మాస్ డైరెక్టర్ సినిమాకి అనిరుధ్ సింక్ అవ్వగలడా ?

రాజ్-కోటి, మణిశర్మ వంటి వారు బాలయ్య సినిమాలకు సంగీతం అందించినప్పుడు బాలయ్య సినిమాల్లో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉండేవి. అయితే.. ఈమధ్యకాలంలో బాలయ్య సినిమాలు ఆడుతున్నా.. ఆయన సినిమాలోని పాటలు మాత్రం జనాలకి పెద్దగా గుర్తుండడం లేదు. తాను చేసే మాస్ సినిమాలు జనాలు ఎంజాయ్ చేయాలనేది మాత్రమే ధ్యేయంగా పెట్టుకొన్న బాలయ్య కూడా పాటల విషయంలో ఎప్పుడు కేర్ చేయలేదు. అయినప్పటికీ.. పాటల్ని కూడా ఆ పాటలో బాలయ్య సూపర్ ఎనర్జీటిక్ గా వేసే డ్యాన్స్ ను ఎంజాయ్ చేసేవారు ఆడియన్స్. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ “జై సింహా” చిత్రంలోని అమ్మకుట్టి పాట. ఆ పాటలో బాలయ్య డ్యాన్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో చూసి జనాలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.

అయితే.. బోయపాటి శ్రీను మాత్రం తాను బాలయ్యతో తెరకెక్కించబోయే చిత్రం ఆడియో పరంగా కూడా బాగుండాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే ఈ చిత్రం దేవిశ్రీప్రసాద్ ను కాకుండా అనిరుధ్ ను కన్సిడర్ చేస్తున్నాడు. “అజ్ణాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్” సినిమాలకు అనిరుధ్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం హైలైట్ అయిన విషయం తెలిసిందే. మరి బోయపాటి-బాలయ్య-అనిరుధ్ ల క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus