తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు లేరు అనే మాట వినిపించినప్పుడు, తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా ఇతర భాషల్లో ఎక్కువగా విజయం సాధిస్తున్నారు అనే పొగడ్త వినిపించినప్పుడు కచ్చితంగా ప్రస్తావనకొచ్చే హీరోయిన్ అంజలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ తెలుగు అందం ఇప్పుడు 50 సినిమాల మైలురాయికి చేరుకుంది. సినిమాల్లో విజయాలు ఆశించినంత లేకపోయినా ప్రామిసింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లు అంటే మొహమాటపడదు అని కూడా అంజలికి పేరు.
అయితే ఆ సన్నివేశాల గురించి ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది. అందుకే ఆ సన్నివేశాలకు దూరంగా ఉండాలి అనుకుంటాను అని చెప్పింది అంజలి. అయితే కొన్నిసార్లు సినిమా కోసం చేయాల్సి వస్తోంది అని కూడా చెప్పింది. కొన్ని సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను.
ఆ సీన్స్ చేసేటప్పుడు అసౌకర్యంగా అనిపించినా… వాటిల్లో నటిస్తాను అని నటిగా (Anjali) తన ప్రొఫెషనలిజం గురించి మాట్లాడింది. నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి, సినిమాల్లో ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి చాలా తేడా ఉంటుంది. రెండూ ఒకటే అనుకోవడం సరికాదు అని కూడా అంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అని క్లారిటీ ఇచ్చింది.
అంజలి సినిమాల సంగతి చూస్తే విశ్వక్‌సేన్ హీరోగా రూపొందుతోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో అంజలి కీలకపాత్రలో నటించింది. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమాతో పాటు తన 50వ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గతంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్.