Anjali: గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇచ్చిన అంజలి.. చరణ్ తో కలిసి డ్యాన్స్ అంటూ?

  • May 27, 2024 / 06:31 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా షూట్ పూర్తయ్యే వరకు తర్వాత సినిమాల షూటింగ్ లో పాల్గొనడం కష్టమేననే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అంజలి (Anjali)  నటిస్తుండగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అంజలి గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో తాను కూడా హీరోయిన్ గానే నటిస్తున్నానని ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొంతమేర బ్యాలెన్స్ ఉందని ఆమె కామెంట్లు చేశారు. గేమ్ ఛేంజర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో నా సన్నివేశాలు వస్తాయని అంజలి పేర్కొన్నారు. చరణ్ కు, నాకు మధ్య ఒక పాట కూడా ఉందని అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్ డేట్స్ ఇవ్వాలని కోరగా దిల్ రాజు  (Dil Raju) గారు, శంకర్ (Shankar) గారి అనుమతి లేకుండా చెప్పకూడదని అంజలి పేర్కొన్నారు.

రామ్ చరణ్ మంచి వ్యక్తి అని యాక్టింగ్ కు సంబంధించి చరణ్ నూటికి నూరు శాతం ఇవ్వడానికి ట్రై చేస్తారని అంజలి తెలిపారు. అంజలి కామెంట్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) ఈ సినిమాకు కథ అందించారు. గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇండియన్2 (Indian 2) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని శంకర్ మార్క్ సినిమాలా గేమ్ ఛేంజర్ ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో ఎక్కువ సమయం కేటాయించిన సినిమాలలో ఈ సినిమా ఒకటి కాగా ఈ సినిమాతో ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ మరింత ఆలస్యమైతే మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే ఛాన్స్ ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus