జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి తల్లి అంజనమ్మ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ అంతా ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లామని పవన్ వెల్లడించారు. ఆ సమయానికి పవన్ వయస్సు 6 నెలలు మాత్రమేనని తిరుపతిలో ఉన్న యోగ లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ లో పవన్ కు అన్నప్రాశన చేయించాలని అనుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు.

నా నిర్ణయానికి కుటుంబ సభ్యులు సైతం మద్దతు పలికారని అంజనమ్మ పేర్కొన్నారు. ఆ సమయంలో మా దగ్గర ఉన్న తిరుపతి లడ్డు, పుస్తకాలు, కత్తి, పెన్ను, మరికొన్ని వస్తువులను పవన్ ముందు పెట్టగా పవన్ మొదట కత్తి పట్టుకుని తర్వాత పెన్ను పట్టుకున్నాడని అంజనమ్మ తెలిపారు. పవన్ మొదట కత్తి పట్టుకోవడంతో కోపంగా ఉంటాడని అనుకున్నానని ఆ తర్వాత పెన్ను పట్టుకోవడంతో ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తాడని భావించానని అంజనమ్మ తెలిపారు.

పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి దీక్షలు తీసుకునేవాడని బాల్యంలో కూడా అయ్యప్పమాల వేసుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. నేను శబరిమలై వెళ్లి దర్శనం చేసుకోవాలని పవన్ కు చెప్పానని ఆ సమయంలో పవన్ అయ్యప్ప మాల వేసుకున్నాడని అంజనమ్మ తెలిపారు. మేము వెళ్లి దర్శనం చేసుకుని వచ్చామని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ చిన్నప్పుడు ఎక్కువగా పూజలు చేసేవాడు కాదని ఆమె పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో దీక్ష చేయడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. వచ్చే ఏడాది పవన్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
