కాస్టింగ్ కౌచ్‌కి సంబంధించిన ‘మీటూ’.. హాలీవుడ్‌లో దీని గురించి నటీమణులు ఆరోపణలు చేసే వరకు బయట జనాలకు దీని గురించి పెద్దగా తెలిసింది లేదు.. అక్కడ చట్టాలు, లెక్కలు వేరు కాబట్టి ఆధారాలతో నేరం రుజువవడంతో కోర్టు శిక్ష విధించడంతో.. మిగతా ఇండస్ట్రీలకు చెందిన మహిళలు కూడా తమకు జరిగిన అన్యాయం గురించి.. ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బహిరంగంగా చెప్పడానికి మీడియా ముందుకొచ్చారు.. ఇండియాలో బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించిందీ వ్యవహారం..
కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్‌లో కూడా కొందరు నోరు విప్పారు.. ఇక టాలీవుడ్‌లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.. మాధవీ లత, గాయత్రి గుప్తా లాంటి వాళ్లు మీడియో ముందు కొందరి బండారం బయటపెట్టారు.. ఇక శ్రీరెడ్డి అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఇదిలా ఉంటే.. హాలీవుడ్‌లో కొద్ది రోజుల క్రితం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఓ నిర్మాతకు మరో కోర్టు అదనంగా శిక్ష విధించిన వార్త వైరల్ అవుతోంది..
వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వేన్‌స్టీన్.. ఓ నటి, మోడల్ మీద 2013లో అత్యాచారం చేసినట్లు గతేడాది డిసెంబర్‌లో లాస్ ఏంజెల్స్ కోర్టు నిర్ధారించింది.. దాదాపు 80 మంది నటీమణులు, మహిళలు ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఈ నిర్మాత మీద అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో.. 23 సంవత్సరాల శిక్ష పడింది.. మూలిగే నక్క మీద తాటికాయ పడట్టు.. న్యూయార్క్‌లో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది..
ఈ నిర్మాత పదేళ్ల క్రితం ఓ యూరోపియన్ నటిపై బెవర్లీ హిల్స్ హోటల్ రూంలో అత్యాచారానికి పాల్పడినందుకు గానూ.. లాస్ ఏంజిల్స్ కోర్ట్ 16 ఏళ్ల శిక్ష విధించింది.. న్యూయార్క్‌లో ఇప్పటికే 23 ఏళ్లు, ఇదో 16.. అంటే ఈ లెక్కన హార్వే వేన్ స్టీన్ జీవితాంతం ఊచలు లెక్క పెట్టాల్సిందే..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?