Gopichand: గోపిచంద్ లిస్టులో మరో పెద్ద డైరెక్టర్?

మాస్ హీరో గోపిచంద్ కి (Gopichand) ప్రస్తుతం హిట్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు. వరుసగా ‘పక్కా కమర్షియల్ (Pakka Commercial) ,’ ‘రామబాణం (Ramabanam),’ ‘భీమా’ (Bhimaa) , ‘విశ్వం’ (Viswam) వంటి చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో ఆయన మార్కెట్‌పై ప్రభావం పడింది. నెక్స్ట్ ఎలాగైనా సాలిడ్ హిట్ తో తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జిల్ (JIl) , రాధే శ్యామ్ (Radhe Shyam) ఫేమ్ రాధాకృష్ణ (Radha Krishna Kumar) దర్శకత్వంలో సినిమాను లైన్‌లో పెట్టినట్లు సమాచారం.

Gopichand

గోపిచంద్ తమిళ దర్శకుడు శివతో (Siva) కూడా సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉందట. అజిత్‌తో (Ajith Kumar) వరుస కమర్షియల్ హిట్లు అందించిన శివ ఇప్పుడు ‘కంగువా’(Kanguva)  సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అజిత్ సినిమాలతో బాక్సాఫీస్ పై రాణించిన శివ, ప్రస్తుతం గోపిచంద్‌తో మరోసారి కలవాలని భావిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో శివ, గోపిచంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘శౌర్యం’ (Souryam) చిత్రం సూపర్ హిట్ కాగా, ‘శంఖం’ (Sankham) సినిమా పర్వాలేదనే స్థాయిలో నిలిచింది.

కంగువా ప్రమోషన్ సమయంలో కూడా శివ గోపిచంద్‌తో సినిమా చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉందని చెప్పాడు. గోపిచంద్ తనకు తొలి అవకాశం ఇచ్చిన నటుడని గుర్తుచేసుకుని, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గమనించేలా ముచ్చటించాడు. టైమ్ కుదిరితే తాము కలిసి తప్పకుండా సినిమా చేస్తామని వెల్లడించాడు. కానీ ఇప్పుడు కంగువా సినిమాతో శివ పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే, గోపిచంద్ లాంటి హీరోతో సినిమా చేస్తాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

1000 కోట్ల టార్గెట్ తో వస్తున్న కంగువా హిట్ అయితే, శివ మీద పాన్ ఇండియా హీరోల దృష్టి మరింతగా పడే అవకాశముంది. ఇక ఆ తరువాత, గోపిచంద్‌తో మరోసారి పని చేయాలనే ఆలోచనను కొనసాగిస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. గోపిచంద్ కి కూడా శివ వంటి డైరెక్టర్ హిట్ ఇస్తే, ఆయన కెరీర్ లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాని జెట్ స్పీడ్.. జస్ట్ 3 నెలల్లో మరో సినిమా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus