మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వశిష్ఠ (Mallidi Vasishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సెట్స్‌పై ఉంది. రీసెంట్ గా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో (Srikanth Odela) ఒక వైల్డ్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రక్తంతో తడిసిన చేతులతో ఊచకోత గ్యారెంటీ అని హింట్ ఇచ్చారు. అయితే ఆ ఊచకోత కంటే ముందే మెగాస్టార్ ట్విస్టులతో కూడిన మాస్ కామెడీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ముందుగా విశ్వంభర ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపే మరో భారీ సినిమాకు ప్లాన్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. తాజాగా అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో వర్క్ చేయడం తన కల అని, ఆ కలను నిజం చేసుకునే దశలో ఉన్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ విషయానికి వస్తే, ఇది పక్కా కామెడీ మాస్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం కథా రచన దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ మీడియాతో మాట్లాడుతూ, స్క్రిప్ట్ చర్చలు జరగడం పూర్తికావాల్సి ఉందని, పక్కా స్క్రిప్ట్ సిద్ధమయ్యాకే ప్రకటన చేస్తామన్నారు. సాహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి 2026 సంక్రాంతి సీజన్ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరు మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని కూడా సమాచారం.
కానీ ఈ చిత్రం కంటే ముందే అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా చిరు-అనిల్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిరు-అనిల్ కాంబోలో మునుపెన్నడూ చూడని వినోదాత్మక అంశాలతో, మాస్ ట్విస్ట్ లతో ఈ సినిమా తెరకెక్కనుందని యూనిట్ సభ్యులు హింట్ ఇచ్చారు. ఇకపోతే బాబీ కొల్లి (Bobby) , బోయపాటి శ్రీను (Boyapati Srinu) కూడా చిరు కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చిరు కొత్త ప్రాజెక్టులపై మరింత ఆసక్తి పెరిగింది.