సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రిలేషన్‌ బ్రేక్స్‌

సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్‌లు కొనసాగుతున్నాయి. మొన్నటికిమొన్న ధనుష్‌ – ఐశ్వర్య తాము విడాకులు తీసుకున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పుడు మరో స్టార్‌ కపుల్‌ దూరమవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే వాళ్లు మన దేశానికి చెందిన వాళ్లు కాదు. అమెరికన్‌ నటుడు కీత్‌ పవర్స్‌, రియాన్‌ డెస్టినీ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియాలో చర్చగా మారింది. ప్రేమ ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గిపోతుంది అనేది ఎవరికీ తెలియదు అంటుంటారు పెద్దలు.

గతంలో చాలా సందర్భాల్లో ఈ విషయం నిరూపితమైంది. కొన్ని ప్రేమ పెళ్లిళ్లు ఏళ్ల తరబడి ఉండి తర్వాత విడాకులకు దారి తీస్తున్నాయి. ఇంకొన్ని అయితే నాలుగైదు నెలలకే డివరోర్స్‌ బాట పడుతున్నాయి. తాజాగా కీత్‌ పవర్స్‌, రియాన్‌ రిలేషన్‌ కూడా ఇలానే కొన్ని ఏళ్లకే పరిమితమైపోయింది. ప్రేమ పుట్ట‌డానికి క్ష‌ణం చాలంటారు.. కానీ ఆ ప్రేమ‌ను క‌ల‌కాలం నిలుపుకోవ‌డం క‌ష్ట‌మే అంటుంటారు. ఈ విషయాన్ని మన సెల‌బ్రిటీలు నిరూపిస్తూ ఉంటారు.

కొందరు ప్రేమ‌లో ఉండ‌గానే బ్రేక‌ప్ చెప్పుకుంటుంటే, ఇంకొందరు పెళ్లై పిల్ల‌లు పుట్టి, వాళ్లు పెద్దైన త‌ర్వాత కూడా విడిపోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. అలా అంత‌ర్జాతీయ మీడియా వివరాల ప్రకారం కీత్‌, రియాన్‌ విడిపోతున్నారట. ఈ విషయాన్ని వారు తమ స‌న్నిహితులు చెప్పారని సమాచారం. కీత్‌ పవర్స్‌, రియాన్‌ డెస్టినీ గత నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. క్యూట్‌ కపుల్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వారి ఫొటోలతో సందడి చేస్తుంటారు. అయితే తమ నాలుగేళ్ల రిలేషన్‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి రెడీ అయ్యార‌ట‌.

కెరీర్ మీద ఫోక‌స్ పెట్టాల‌ని భావించిన ఆ ఇద్ద‌రూ ప్రేమికులుగా విడిపోయి, స్నేహితులుగా ఉందామని నిర్ణయించుకున్నారట. త్వరలో ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారట. కీత్‌ ప‌వ‌ర్స్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారమవనున్న ‘ది అగ్లీస్‌’, ‘ప‌ర్‌ఫెక్ట్ ఫైండ్’లో కీలక పాత్ర పోషించాడు. ఇక సింగ‌ర్‌, న‌టి అయిన రియాన్‌ డెస్టినీ ప్ర‌స్తుతం బ్యారీ జెన్‌కిన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘ఫ్లింట్ స్ట్రాంగ్’ అనే సినిమాలో న‌టిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus