Ghaati Collections: 5వ రోజు మరింత డౌన్ అయ్యింది

అనుష్క నుండి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ‘ఘాటి’. 2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క చేసిన సినిమా ఇది. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో టాలీవుడ్ కి డెబ్యూ ఇవ్వగా…. జగపతి బాబు, చైతన్య రావ్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అయితే సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్,ట్రైలర్ రేంజ్లో లేకపోయినా పర్వాలేదు అనే టాక్ అయితే తెచ్చుకుంది.

Ghaati Collections

కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘ఘాటి’ కి టాక్ తగ్గ కలెక్షన్స్ అయితే రాలేదు. మొదటి వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది.మంగళవారం మరింత డౌన్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

 

 

నైజాం  1.05 cr
సీడెడ్  0.18 cr
ఆంధ్ర (టోటల్)  0.81 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  2.04 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.20 cr
ఓవర్సీస్  0.31 cr
మిగిలిన వెర్షన్లు   0.12 cr
వరల్డ్ వైడ్ టోటల్   2.67 cr (షేర్)

 

‘ఘాటి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.2.67 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.07 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.23.33 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది.టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయింది. మరో 2 రోజులైతే క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి సగం టార్గెట్ అయినా రీచ్ అవుతుందో లేదో చూడాలి.

కోలీవుడ్‌లో కిర్రాక్‌ కాంబో.. ఇద్దరు స్పెషలిస్ట్‌లు కలసి వస్తే ఇంకేమైనా ఉందా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus