టాలీవుడ్‌లో మరో విడాకులు.. కోర్టుకెక్కిన భార్య!

స్టార్‌ డైరక్టర్‌గా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు కొత్త సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల. కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచిన శ్రీను వైట్ల వైవాహిక బంధం తెగిపోనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ మేరకు ఆయన భార్య రూప వైట్ల విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. దీని కోసం నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కనున్నారని చెబుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఆ జంట గురించి తెలిసిన వాళ్లు మాత్రం నిజమే అంటున్నారు.

శ్రీను వైట్ల, రూప వైట్ల గత కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. సుమారు నాలుగేళ్ల నుండి వీరు వేర్వేరుగానే ఉంటున్నారని సన్నిహితులు చెబుతుంటారు. అభిప్రాయ బేధాలు రావడం వల్ల దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే కలసి జీవించడానికి ఇంకా ఇద్దరి మనసులు సిద్ధమవ్వకపోవడంతో విడాకుల కోసం ముందుకు వెళ్తున్నారట. రూప వైట్లనే ఈ విషయంలో ఇనీషియేటివ్‌ తీసుకున్నారని చెబుతున్నారు. నాంపల్లి కోర్టులో విడాకుల కోసం ఆమెనే అప్రోచ్‌ అయ్యారని చెబుతున్నారు.

శ్రీను వైట్ల సినిమాలకు రూప వైట్ల ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేశారు. వివాహమయ్యాకే ఆమె సినిమాల్లోకి వచ్చారు. సినిమాల ప్రీరిలీజ్‌లు, ఆడియో ఫంక్షన్‌లకు ఆమె హాజరై చాలా ఆనందంగా కనిపించేవారు. అయితే నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందో కానీ ఇద్దరూ దూరమయయ్యారు. ఇన్నాళ్లూ విడివిడిగా ఉంటున్నా.. ఇప్పుడు విడాకుల కోసం సిద్ధమయ్యారు. దీంతో టాలీవుడ్‌లో మరో విడాకుల వ్యవహారం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారంపై వారి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

శ్రీను వైట్ల సంగతి చూస్తే.. ‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘దూకుడు’.. వరుసగా ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ కలసి రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మంచు విష్ణుతో ‘ఢీ అంటే ఢీ’ అనౌన్స్‌ అయినా.. ఇంకా సినిమా స్టార్ట్‌ అవ్వలేదు. త్వరలో ప్రారంభమవుతుంది అని సమాచారం. అయితే విడాకుల వ్యవహారం తేలాకే సినిమా ఉండొచ్చు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus