మామయ్యతో కలిసి అన్ స్టాపబుల్ సందడి చేయనున్న మెగా మేనల్లుడు?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఇలా బాలయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు..

పవన్ సమాధానాలు ఏంటి అనే విషయం అందరిలోనూ ఉత్కంఠత లేపుతోంది. ఈ ఎపిసోడ్ ఒకవైపు అభిమానులలోను మరోవైపు రాజకీయ నాయకులలో కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మరొక హీరో ఎంట్రీ కూడా ఉండబోతుందని సమాచారం. ఇక బాలకృష్ణ ఈ షోలో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు ఫోన్ చేశారని తెలుస్తోంది.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. వీరితోపాటు మరొక మెగా హీరో కూడా ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు మెగా హీరో సాయిధరమ్ తేజ్ అంటే ఎంత అభిమానమో మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.

ఇక సాయిధరమ్ తేజ్ సైతం తన మామయ్య అంటే ఎంతో గౌరవంగా ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ టాక్ షోలో సాయిధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus