మంచి సినిమా థియేటర్‌లో ఎంత బాగా ఆడుతుంవదో, ఓటీటీల్లోనూ అంతే బాగా ఆడుతుంది. అందులో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టించాలి చెప్పండి. ఇప్పుడు ఓటీటీ రంగంలో ‘ఆర్ఆర్‌ఆర్’ అంతటి ఘనమైన రికార్డులు సాధిస్తోంది. సినిమా అంతర్జాతీయ రిలీజ్ లేకపోవడం ఒక కారణమైతే, నెట్‌ఫ్లిక్స్ లాంటి విదేశాల్లో బాగా పాపులరైన ఓటీటీలో రావడంతో రీచ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్‌ఆర్ఆర్’. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌లో సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఆ తర్వాత జీ5, నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రికార్డు సాధించింది. గత రెండు వారాల్లో ఈ సినిమా 40 లక్షలకి పైగా స్ట్రీమింగ్ అవర్స్ సాధించిందట.
దీంతో నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచిందట. 52 లక్షల 30 వేలకి పైగా గంటలు స్ట్రీమింగ్స్‌తో భారీ రికార్డు నెలకొల్పిందని నెట్‌ఫ్లిక్స్ తన గోల్డెన్ ట్విటర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చింది. మొన్నీ మధ్య ఈ సినిమా రోటెన్ టమోటాస్‌లో కూడా ఓ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. 2022కిగాను ఉత్తమ చిత్రాల జాబితాలో 46వ స్థానంలో నిలిచింది రాజమౌళి చిత్రం.
తారక్ – చరణ్‌ల స్నేహబంధానికి 91 శాతం క్రిటిక్స్ రేటింగ్స్ రాగా, 94 శాతం ఆడియన్స్ రేటింగ్స్ వచ్చాయట. దీంతో ఈ సినిమా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ను దాటేసినట్లయింది. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’కు 94 శాతం క్రిటిక్స్ రేటింగ్ 94 శాతం ఉండగా, ఆడియన్స్ రేటింగ్ 90 శాతం. ఈ లెక్కన ‘అవెంజర్స్..’పై ‘ఆర్‌ఆర్‌ఆర్’ దే పై చేయి అయ్యింది. ఇంత మంచి రేటింగ్‌లు, వ్యూయర్‌షిప్, స్ట్రీమింగ్ మినిట్స్ వస్తున్నా చిత్రబృందం విదేశీ విడుదల గురించి ఆలోచించక పోవడం గమనార్హం.
#RRR is everywhere and we’re loving it ❤️ pic.twitter.com/nqK9AQcJ1O
— Golden (@netflixgolden) June 15, 2022
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!