అఖిల్ పై మరో న్యూస్!
- August 22, 2016 / 10:27 AM ISTByFilmy Focus
గత కొంతకాలంగా అఖిల్ రెండో సినిమాపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. మొదట వంశీ పైడిపల్లితో, తరువాత హను రాఘవపూడితో చేస్తున్నాడని మాటలు వినిపించాయి. కానీ ఇద్దరు దర్శకులు తప్పుకున్నారు. ఆ తరువాత మారుతి పేరు వినిపించింది. అది కాకుండా విక్రమ్ కె కుమార్ తో ఈసారి పక్కా సినిమా ఉంటుందని మరో వార్త హల్ చల్ చేసింది. కానీ ఇవేమీ కాకుండా ఇప్పుడు అఖిల్ ఓ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలలో మన్మధుడు సినిమా ఒకటి. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అఖిల్ తో చేయించాలని నాగ్ భావిస్తున్నాడట. అలా చేస్తే కచ్చితంగా అఖిల్ కి హిట్ వస్తుందనే నమ్మకం. దీనికోసం త్రివిక్రమ్ ను రంగంలోకి దింపాలనేది నాగ్ ఆలోచన. అంతా బానే ఉంది.. కాని త్రివిక్రమ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















