Waltair Veerayya: ఆ యంగ్‌ హీరోకు చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చారా..!

చిరంజీవి ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్‌ లాంటి సినిమాను ఇస్తాను అంటూ.. బాబీ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సినిమా మొదలవ్వడమే హైనోట్‌లో అయ్యింది. ఆ తర్వాత సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటిస్తున్నాడు అంటూ వార్తలొచ్చేసరికి.. బాబీ ఏదో మ్యాజిక్‌ చేయబోతున్నాడు అని అనుకున్నారు. అయితే బాబీ మ్యాజిక్‌లు అక్కడితో ఆగడం లేదు. సినిమాలో మరో స్పెషల్‌ రోల్‌ను తీసుకొస్తున్నారట బాబీ. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ రోల్‌ గురించే డిస్కషన్‌ నడుస్తోంది.

చిరంజీవి కథానాయకుడిగా బాబీ సినిమా అనేసరికి.. ఇది పోలీసు బ్యాగ్రౌండ్‌లో సినిమా అని ఫిక్స్‌ అయిపోయారు సినిమా జనాలు. ఎందుకంటే బాబీకి అలాంటి కథలపై మంచి పట్టుంది. అనుకున్నట్లుగా ‘వాల్తేరు వీరయ్య’ అచ్చంగా అలాంటి కథే అనుకున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పెట్టడం, ప్రీ లుక్‌, లుక్‌, టీజర్‌ చూశాక.. ఇది మత్స్యకారుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే సినిమాలో పోలీసుల పాత్ర బలంగానే ఉంటుందట.

అందులో భాగంగానే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను మాస్‌ మహారాజ్‌ రవితేజకు ఇచ్చారు. దానికి సంబంధించిన విషయాన్ని అద్భుతంగా వీడియో రూపంలో అనౌన్స్‌ చేశారు కూడా. అయితే సినిమాలో మరో స్పెషల్‌ రోల్‌ ఉందట. మరీ పెద్దది కాకపోయినా.. సినిమా విలన్‌ చేతిలో చనిపోయే ఓ ఎస్‌ఐ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుందట. దాని కోసం కొత్త కుర్రాడిని అనుకున్నారట తొలుత. అంత సినిమాను ఎమోషనల్‌గా డ్రైవ్‌ చేసే ఆ పాత్రకు యువ హీరో అయితే బాగుంటుందని తర్వాత అనుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం యంగ్‌ హీరోను అనుకుంటున్నారట.

ఆ యంగ్‌ హీరో ఎవరో కాదు… ‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌లో మాన్లీ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ. ఆ సినిమా తర్వాత సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ.. విలన్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్ట్రిక్‌ అండ్ స్ట్రాంగ్‌ ఎస్‌ఐగా ‘వాల్తేరు వీరయ్య’లో కనిపిస్తాడని టాక్‌. ఆ పాత్ర చనిపోయిన నేపథ్యంలో ‘వీరయ్య’ ఎంట్రీ ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. దీని సంగతేంటో తేలాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. అప్పుడేగా మన ‘వీరయ్య’ ఆగమనం.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus