బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఇటీవల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ‘నెపోటిజం’ అనే ఇష్యూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. సుశాంత్ కు బాలీవుడ్ స్టార్లు అవకాశాలు రానివ్వకుండా చేశారని.. అలాగే అతను చెయ్యాల్సిన ప్రాజెక్ట్ లను కూడా క్యాన్సిల్ చేసేలా కుట్ర పన్నారని వివాదం నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో నటుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
మరాఠీ నటుడు అశుతోష్ భక్రే బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన గణేష్ నగర్ లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు. ‘ఇచర్ థార్లా’ పక్కా’ ‘భకర్’ వంటి క్రేజీ సినిమాల్లో ఇతను నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇతని భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా పలు మరాఠీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.ఇదిలా ఉండగా.. అసలు ‘అశుతోష్ భక్రే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?’ అనే విషయం పై పెద్ద చర్చ నడుస్తుంది.
ఇతను నెల రోజుల క్రితమే నాందెడ్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నాడట. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులే చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా ఇతను డిప్రెషన్ కు లోనైనట్టు కూడా వారు చెబుతున్నారు. అందుకే ఆత్మహత్య చేసికునిచనిపోయాడని ఇతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా వీరు చెప్పిన వివరాలను రికార్డ్ చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారని సమాచారం.